Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: ‘ది ప్యారడైజ్’ స్పెషల్ ఇంటర్వ్యూ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లలో ఒక ఆసక్తికర అంశం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ తరంలో స్వయంకృషితో ఎదిగిన నాని నటనను, స్క్రీన్ ప్రెజెన్స్‌ను విశ్లేషిస్తూ మోహన్ బాబు చేసిన పోలిక ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. వెండితెరపై యాక్షన్ సన్నివేశాలు, భారీ పోరాటాలు ఎవరైనా చేస్తారని, కానీ కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా లోకాన్ని థియేటర్లకు రప్పించి వారి హృదయాలను గెలుచుకోవడం ఎంతో కష్టమైన విషయమని అన్నారు. “ప్రతి తరానికి ఒక ప్రత్యేకమైన హీరో ఉంటాడు. మా తరంలో లేడీస్ ఫాలోయింగ్‌తో ఫ్యామిలీ చిత్రాలను శాసించిన ఘనత శోభన్ బాబు గారిది. ఈ తరంలో నానిని తెరపై చూస్తున్నప్పుడు నాకు తరచూ శోభన్ బాబు గారే గుర్తుకొస్తారు. ఆయనలాగే నాని కూడా మహిళల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు” అంటూ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.
సాధారణంగా ఒకసారి ఫ్యామిలీ హీరోగా ముద్రపడితే ఆ ఇమేజ్ను వదిలించుకోవడం సులభం కాదని, కానీ నాని మాత్రం ఏ ఇమేజ్ చట్రంలోనూ బందీ కాకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాడని మోహన్ బాబు కొనియాడారు. మాస్ అయినా, క్లాస్ అయినా, కంటెంట్ బేస్డ్ సినిమాలైనా నాని తనదైన శైలిలో ఒదిగిపోవడం వల్లే ఇంతటి క్రేజ్ దక్కిందని విశ్లేషించారు. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనంత మంది స్టార్ హీరోలను దగ్గరుండి చూసిన మోహన్ బాబు లాంటి సీనియర్ లెజెండ్.. నానిని ఏకంగా ‘సోగ్గాడు’ శోభన్ బాబుతో పోల్చడంపై అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఇచ్చిన ఈ ప్రశంస నాని కెరీర్‌కు మరో పెద్ద కాంప్లిమెంట్‌గా నిలిచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?