Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలుగా నిలిచిన ఐదుగురు..
- పైలట్‌తో పాటు ప్లంబర్, బిజినెస్ మ్యాన్, డెంటిస్ట్, బ్యాంకర్ సాయం..
- విమానం కుప్పకూలకుండా అడ్డుకున్న వారిపై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Heroes: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో 180 మంది ప్రాణాలను కాపడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోగా నిలిచారు. కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తి దాడి చేయడంతో రక్తమోడుతున్నా చివరి వరకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
స్మిత్ ఒక్కరే కాదు, ఆయనకు తోడుగా ప్రయాణికుల్ని కాపాడేందుకు మరికొందరు సాయం చేసి హీరోలుగా మారారు. సాయం చేసినవారిలో ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్ ఉన్నారు. స్మిత్ కష్టపడి కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు అందులోకి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విమానం ఏకంగా నిమిషంలోపే 16000 అడుగుల కిందకు పడిపోయింది. అదుపులోకి తీసుకువచ్చారు. 9/11లాంటి మరో ఉగ్రదాడిగా మారకుండా స్మిత్ అడ్డుపడ్డారు.
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
కాక్‌పిట్ తలుపులు తెరుచుకోగానే హీరోల ఎంట్రీ..
ఇజ్రాయిల్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నలుగురు ఇజ్రాయిల్ పౌరులు వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో లేని ఇద్దరు పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని ఒక చిన్న విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న వ్యక్తి యానివ్ హయూన్, వృత్తిరీత్యా ప్లంబర్ అయిన ఆయనను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. యానివ్ హయూన్ దాడి చేసిన కో-పైలట్‌ను విమాన కంట్రోల్స్ నుంచి దూరంగా లాగాడు. విమానాన్ని స్థిరంగా ఉంచేందుకు కంట్రోల్ యోక్‌ను వెనక్కి లాగినట్లు హయూన్ వెల్లడించారు.
అసఫ్ రజువాన్ అనే బిజినెస్ మ్యాన్ కాక్‌పిట్‌లోకి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించాడు. మరో ప్రయాణికుడు జ్వికా మానెస్తో కలిసి నిందితుడిని పట్టుకుని అదుపులో ఉంచారు. సౌదీలో ల్యాండ్ అయ్యే వారకు కో-పైలట్ వీరి అదుపులోనే ఉన్నారు.
బ్యాంక్ లియూమీకి చెందిన అండర్ రైటింగ్ కంపెనీ సీఈఓ జ్వికా మానెస్ కూడా స్పందించిన ప్రయాణికుల్లో ఒకరు. హెడ్‌ఫోన్ వైర్లను ఉపయోగించి అనుమాత కోపైలట్‌ను కట్టేసినట్లు చెప్పారు.
డెంటిస్ట్ షోటా ముసాయేవ్ మొదట కాక్‌పిట్‌లోకి వెళ్లి కోపైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. తీవ్రంగా గాయపడిన పైలట్ స్మిత్ మచ్చర్‌కు చికిత్స అందించారు. తాను డాక్టర్ కావడంతో పైలట్ గాయాల నుంచి వస్తున్న రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ల్యాండింగ్ ముందు వరకు పైలట్ స్పృహలోనే ఉండి ల్యాండింగ్‌కు సహకరించారు.
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?