ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదన సింగర్ కల్పన కలిసింది. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నానంటూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్‌లు తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా... అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్న విషయం తెలిసిందే. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ…
వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఓ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
KTR at Women's Commission: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (శనివారం) రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించారు.
Women’s Commission Shock to Venu Swamy Parankusham : సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన స్వామి మీద తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు.…
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.