Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
- షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల కేసు
- రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు
- నిందితుడి కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఘటన రాత్రి సుమారు 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. నిందితుడి కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి
దర్యాప్తు అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ ముందుగా ప్రియురాలైన మైనర్ బాలిక ఇంటికి వచ్చి 11 గంటల ప్రాంతంలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకొని వెళ్లాడు. బయటికి వెళ్ళి వద్దామని చెప్పి మైనర్ బాలికను మభ్యపెట్టి కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మైనర్ బాలిక అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు వారించినప్పటికీ ఇప్పుడే వస్తామంటూ బాలికను బయటికి తీసుకెళ్లాడు నిందితుడు.
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి రాజకుమార్.. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అదే కారులో బాలిక ఇంటికి వచ్చిన రాజకుమార్.. ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాయనమ్మ రుక్మిణి, లక్ష్మీ లను అతికిరాతికంగా చంపేశాడు. అక్కడినుంచి నేరుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు నిందితుడు రాజకుమార్. తన పిల్లల్ని చూడాలని ఉందని భార్యకు ఫోన్ చేశాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ ని ఇంట్లోకి రానిచ్చింది భార్య.
అనంతరం తన ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లల హత్య
ఇంట్లోకి వెళుతూనే భార్యపై కత్తితో దాడి చేశాడు రాజకుమార్.. వెంటనే అప్రమత్తమైన భార్య రాజ్ కుమార్ నుంచి తప్పించుకునేందుకు బయట వరకు పరుగులు పెట్టింది. అయినా వదలకుండా భార్యను ఇంట్లోకి తీసుకువచ్చి కిరాతకంగా చంపేశాడు. భార్యను చంపేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా గొంతు కోసి చంపాడు రాజ్ కుమార్.. ఆరుగురిని చంపిన తర్వాత కారులోనే పారిపోయాడు.
ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు
కారులో పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. భార్యా పిల్లలతో పాటు తన ప్రియురాలని వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని చంపేసిన అని తండ్రికి రాజ్ కుమార్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రికి చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాజకుమార్ పారిపోయాడు. రాజకుమార్ కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..