Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhogapuram International Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అనగా ఆగస్టు 1వ తేదీన ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ASR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న VTZ కోడ్‌తోనే కొత్త విమానాశ్రయం సేవలు కొనసాగనున్నాయి.
ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌కు రోజూ ఐదు, బెంగళూరుకు రెండు, విజయవాడకు నాలుగు విమాన సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైమానిక అనుసంధానం అందుబాటులోకి రానుంది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
అంతర్జాతీయ సేవల విషయంలో కూడా భోగాపురం విమానాశ్రయానికి మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ప్రస్తుతం విశాఖ–సింగపూర్ మధ్య వారానికి మూడు రోజులుగా నడుస్తున్న స్కూట్ ఎయిర్ సర్వీసులు ఆగస్టు 17 నుంచి వారానికి నాలుగు రోజులకు పెరగనున్నాయి. అలాగే అబుదాబీకి విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఈ మార్గంలో కూడా వారానికి నాలుగు రోజుల పాటు విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకం, వాణిజ్యం, ఐటీ, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే 30 సంవత్సరాల పాటు షెడ్యూల్ విమానాల కార్యకలాపాలు ఈ విమానాశ్రయం నుంచే కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!