Minister Seethakka: మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసిందని ఫైర్!
- శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి సీతక్క..
- ఢిల్లీ రాష్ట్ర పరువు తీసింది సీఎం కాదు.. మీ కుటుంబమే..
- కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర.. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్: మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్రం పరువు తీస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? అని ప్రశ్నించింది. మీ కుటుంబమే రాష్ట్ర పరువు తీసింది.. మాకు డిల్లీ వ్యాపారాలు తెలియవు.. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం అని మండిపడింది. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర.. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది టీఆర్ఎస్.. మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు, మహిళా కమిషన్ కి సభ్యులు లేరు.. మహిళలు పొదుపు చేసుకున్న 1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు.. పావలా వడ్డీ ఇవ్వలేదు.. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి సీతక్క.
Read Also: IPL 2025 RCB: ‘ఈ సాల కప్ నమ్మదే’.. కొత్త కెప్టెన్ ఆర్‌సిబి తల రాతను మార్చగలడా!
Also Read
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ఇక, తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు అని మంత్రి సీతక్క ప్రశ్నించింది. మేము పంట కాలువలు మూసివేసినట్లుగా టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది.. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏ లోనే కరప్షన్ ఉంది.. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు.. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు అని అడిగారు. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం.. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు.. టీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపింది. మీరు బంఫర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు.. మీరు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు అని తెలిపింది. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాం.. 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారని అడిగింది. ప్రజలకు ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు.. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వేల కక్కుతున్నారు అని మండిపడింది.
Read Also: Anchor Shyamala: హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట.. కానీ..!
అయితే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు స్కీమ్స్ కి పెడితే ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవితను మంత్రి సీతక్క ప్రశ్నించింది. మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు.. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!