IPS Transfers: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. కీలక అధికారులను కూడా మారుస్తూ వచ్చింది ప్రభుత్వం.. తాజాగా మరో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్..
20 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్‌లు
1. HYD సౌత్ రేంజ్ అదనపు కమిషనర్‌గా తస్వీర్ ఇక్బాల్ నియామకం
2. HYD నార్త్‌రేంజ్ జాయింట్ కమిషనర్‌గా శ్వేత
3. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా విజయ్‌కుమార్
4. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి
5. ఫ్యూచర్ సిటీ మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ్‌రెడ్డి
6. సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షిత మూర్తి
7. ఉప్పల్ జోన్ డీసీపీగా సురేష్‌కుమార్
8. చార్మినార్ జోన్ డీసీపీగా కారే కిరణ్
9. ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ
10. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్
11. కూకట్‌పల్లి డీసీపీగా రితిరాజ్
12. శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్
13. సిద్దిపేట సీపీగా రేష్మి పెరుమాళ్
14. మల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్ శ్రీధర్
15. ఖైరతాబాద్ డీసీపీగా శిల్పవల్లి
16. రాజేంద్రనగర్ డీసీపీగా ఎస్ శ్రీనివాస్
17. గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్
18. జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి
19. శంషాబాద్ జోన్ డీసీపీగా బి. రాజేష్
20. షాద్‌నగర్ జోన్ డీసీపీగా శిరీష