Begum Bazar Land: బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!
- హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్..
- బేగంబజార్‌లో గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Begum Bazar Land: హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. హైదరాబాద్‌లోని ప్రసిద్ది చెందిన బేగంబజార్‌లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగంబజార్ లో భూముల ధర ముంబైతో పోటీ పడుతోంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం రూ.20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు ధర రూ.20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం.
Read also: CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బేగంబజార్‌లో ఖాళీ లేదు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు వాటి యజమానులకు బంగారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించినా ఇప్పుడు పాత భవనాలకు గిరాకీ పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి బేగంబజార్ వైపు మళ్లింది. పాత భవనాల విక్రయాలపై నిత్యం ఆరా తీస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు రేటు పెంచడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలంపాటను తలపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలు కొత్త నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర నుండి చాలా మంది టోకు వ్యాపారులు ఇక్కడ స్థిరపడ్డారు. చదరపు అడుగుకు విక్రయించే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలో పలుకుతున్నాయి.
Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!