CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని, పండితులు తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం గురైందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని భావించామన్నారు. వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించామన్నారు. ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కనిదంటూ ఏది లేదని.. తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియాగాంధీ మాట శిలా శాసనం అని తెలిపారు. 2014 ,24 వరకు ఎన్నోన్నో నిర్మించామని చెప్పారన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారన్నారు. అన్నీ నేనే అని చెప్పారన్నారు. ప్రగతి భవన్ పేరుతో గడిని నిర్మించుకుని.. పోలీసులను పహారగా పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలను ప్రగతి భవన్ లోకి రాకుండా దూరం పెట్టారని తెలిపారు.
Read also: Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
ప్రభుత్వ పాలనకు గుండెకాయ సచివాలయం అన్నారు. నాటి మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం కోసం మహా అయితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మనుసు రాలేదు నాటి ప్రభుత్వానికన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమన్నారు. మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామని తెలిపారు. కొందరు తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారన్నారు. జూన్ 2న చెప్పిన.. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎమ్ కోరుకుంటూ నారో జేఎన్టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ కు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే భాద్యత ఇచ్చామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు డిసెంబర్ 9, సోనియాగాంధీ జన్మదినోత్సవమని.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం అన్నారు.
Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..