KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా..?
- తెలంగాణ తల్లిని అవమానిస్తారా..?
- తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా..?
- తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్ నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..
“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??
తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..! అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.
Read Also: SC Classification: నేడు జలసౌదాలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
దీంతో పాటు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీ జీ, మీరు తెలంగాణలో ‘RR టాక్స్’ గురించి మాట్లాడి 4 నెలలు అయిపోయింది.. దానిపై మీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మీరు చెప్తు్న్నప్పటికి.. మీ కేబినెట్ మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ‘ఆర్‌ఆర్ టాక్స్’ గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. వారు మీతో ఏకీభవించలేదా లేదంటే మీ విమర్శలు కేవలం ఎన్నికల వరకేనా అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ… pic.twitter.com/zLV0I2aQeZ
— KTR (@KTRBRS) September 16, 2024
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!