KTR: తెలంగాణ భవన్ లో తాండూరు నియోజకవర్గం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు.. రెండేళ్లు మనకు కష్టాలు తప్పవు అని సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు నిమిషాలకే మాట మార్చారు అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బయట పెట్టకపోయినా గులాబీ సైనికులు అద్భుతంగా పోరాడారు, ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ అన్నారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
అయితే, కారు గుర్తు ఉండి, కేసీఆర్ గుర్తుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని కేటీఆర్ తెలిపారు. రెండేళ్లు బీఆర్ఎస్ కు పరీక్ష కాలం.. కాంగ్రెస్ వాళ్లు ఏమైనా అంటే తలదించుకుని వెళ్లండి, రెండు అడుగులు వెనక్కు వెళ్లండి అని సూచించారు. పంచాయతీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయి, ఎవరి ప్రమేయం ఉండదన్నారు. బీఆర్ఎస్ సర్పంచులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు.. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇలా అన్నింటి జాబితా పంచాయతీల్లో పెట్టాల్సిందే.. సర్పంచులు, పంచాయతీల చేతిలోనే ఉంటుంది.. నిధులు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు.. కాంగ్రెస్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు, అందరూ బాధపడుతున్నారు.. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అంటున్నారు.. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించండి అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
