Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‍తో బాలీవుడ్‍లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నట్లు గత కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అప్పుడెప్పుడో వచ్చిన సమాచారమే కానీ మళ్లీ మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ ఆ ప్రాజెక్ట్ గురించి రాలేదు. దీంతో అసలు రామాయణం ఉందా లేదా అని సినీ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా సాయిపల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్లతో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు ఎదుగుతుందని తెలుస్తోంది. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమయ్యారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.
Read Also:Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..
రామాయణం సినిమాలో కీలకపాత్రలు చేయనున్న బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యశ్‍కు ఇప్పటికే లుక్ టెస్టులు, ప్రీ-విజువలైజేషన్, టెక్ రిహార్సల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉండనుంది. టెక్నికల్‍గా అత్యంత అడ్వాన్డ్స్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్‍ఎక్స్ కంపెనీ డీఎన్‍ఈడీని ఆయన నియమించుకున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్లు.. ఈ చిత్రం కోసం ఇండియాకు వచ్చే పని చేయనున్నారని సమాచారం. నొయిడాలోని ఫిల్మ్ సిటీలో మూవీ ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ నటించడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. కైకేయి పాత్రలో లారా దత్త అలాగే శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని సమాచారం.. దశరథుడి పాత్ర కోసం దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!