CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో త్వరలో స్పోర్ట్స్ పాలసీ తెస్తామన్నారు. అవార్డులు వస్తె.. ఆటోమేటిక్ గా సాయం అందేలా పాలసీ చేస్తామని వెల్లడించారు. పంజాబ్ తరహాలో పాలసీ తీసుకువస్తామన్నారు. స్పోర్ట్స్ స్టేడియం లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Read also: D. Sridhar Babu: కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. భూమి అందుబాటులో ఉంటే మాకు నిధులు విడుదలకు ఇబ్బంది లేదన్నారు. బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నామన్నారు. నేషనల్ అకాడమీ అక్కడ పెట్టాలని అనుకుంటున్నామన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు. టీఎస్ నీ టీజీగా చేస్తేనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే సురవరం పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు అభ్యంతరం లేదన్నారు.
BCCI : ధూమపాన ప్రకటనల్లో ఆటగాళ్లు కనిపించడాన్ని నిషేధించాలని… బీసీసీఐకి ప్రభుత్వం లేఖ