D. Sridhar Babu: సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తామన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉండే విచారణ చేస్తున్నామన్నారు. కొత్త చట్టాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి చట్టాలపై ఆ అభిప్రాయాలు తెలిపాయని వెల్లడించారు. సైబర్ క్రైమ్ అరాచకాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తేవడానికి వెనుకాడబోమన్నారు.
Read also: Telangana Assembly 2024: అంసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక..
సైబర్ క్రైమ్ అరాచకాలు తారాస్థాయికి పోయాయని అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తామన్నారు. సభా ప్రాంగణంలో సభను అప్రతిష్టపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ చట్టాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందన్నారు. అసెంబ్లీ విషయంలో మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియోలు ప్రచారం జరిగాయని మండిపడ్డారు. మంత్రి సీతక్క మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రతిపక్షం చెప్పాలన్నారు.
Telangana Assembly 2024: సీతక్క వీడియో మార్ఫింగ్.. ట్రోలింగ్ అంశం పై సభలో చర్చ..