Jagadish Reddy: చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా..?
- సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారు..
- మూసీ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటాము..
- సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా ?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా..? అని మాజీమంత్రి ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. హైడ్రా,మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి అయిందన్నారు. బడే భాయ్ నోట్ల రద్దుతో ఏం తప్పు చేశారో ఇక్కడ చోటా భాయ్ హైడ్రా విషయంలో తప్పు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం బయటకు తెస్తానని మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. నోట్ల రద్దు దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసిందన్నారు. హైడ్రా ఎవరి మీద కక్షతో తెరపైకి తెచ్చారన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఎవరి కోసమో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా,మూసీ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షా 50 వేల కోట్లు అని ఎవరు చెప్పారని డిప్యూటీ సీఎం అంటున్నారన్నారు. మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? అన్నారు.
Read also: Hyderabad Crime: విషాదం.. కోడలు వేధింపులతో పురుగుల మందు తాగిన కుటుంబసభ్యులు..
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
మీ చేతికి అధికారం వచ్చాక ఏం జరిగిందో చర్చకు రెడీనా? అని సవాల్ విసిరారు. ఎఫ్.టి.ఎల్ లో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము నీకు,నీ ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. మూసీతో లక్ష కోట్ల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లు కూల్చారని గుర్తు చేశారు. మీ కడుపు నింపుకునేందు కోసమే మూసీ ప్రాజెక్టు అన్నారు. డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో భట్టి రేవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు సంపాదించడంలో భట్టి సీఎంతో పోటీ పడుతున్నారన్నారు. బుకాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. మూసీపై ప్రణాళిక మీ దగ్గర ఉందా…? అని ప్రశ్నించారు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. పాత బాసులు కొత్త బాసులు కారణం అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ ను రూపుమాపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. మూసీ ప్రక్షాళనకు 16 వేల కోట్లతో బీఆర్ఎస్ పనులు ప్రారంభించిందన్నారు.
Read also: Health Tips: మెంతి ఆకులు, గింజలు గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు త్రాగునీరు అందించామన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి హిమాత్ సాగర్ కు నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మీకు చేతకాకపోతే చేయడానికి మేము రెడీగా ఉన్నామన్నారు. హాస్థల్స్ లో ఇప్పటి వరకు 26 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. చాలామంది నియంతలు పోయారన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారని అన్నారు. మూసీ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా ? అన్నారు. హర్యానా ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా బీజేపీ గెలిచిందని తెలిపారు.
Festival Rush: హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!