Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ హాట్ హాట్ గా కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని న్యాయస్థానంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ తరపు లాయర్ వాదిస్తూ.. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని ఆరోపంచారు. కేసీఆర్ అడిగినా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవన్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారని లాయర్ తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.. 60 పేజీల కమిషన్ రిపోర్టును మీడియా ప్రతినిధులకు అందజేశారని చెప్పుకొచ్చారు. అనంతరం.. హైకోర్టు బెంచ్ స్పందిస్తూ.. తమకు సమర్పించిన కాళేశ్వరం కాపీ సక్రమంగా లేదని పేర్కొనింది. రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై బెంచ్ కు హరీష్ రావు తరపు లాయర్ ఆర్యమ సుందరం క్షమాపణ చెప్పారు.
Read Also: Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
మరోవైపు, కాళేశ్వరం కమీషన్ రిపోర్టుపై విచారణను హైకోర్టు మధ్యాహ్ననికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిశీలించే కమిషన్ విచారణ చేసింది.. చర్యలు తీసుకునే అంశంపై కమిషన్ ఎలాంటి సిఫార్సు చేయలేదు.. అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పడం సబబే.. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వ్యూలు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
