Hyderabad CP: వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలే.. పోలీసులకు సీపీ వార్నింగ్..
- పోలీసుల అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు..
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad CP: పోలీసులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. లంచాలు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. కాగా.. హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో నగర పౌరులకు సీపీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
Read also: Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
Also Read
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో యాంఫెటమైన్ అనే డ్రగ్ పెద్ద మొత్తంలో పట్టుబడిందన్నారు. ఈ మందులను ఇంజక్షన్లు, లిక్విడ్ రూపంలో వివిధ రూపాల్లో తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. కూల్ డ్రింక్స్ లో అమ్మాయిలకు ఈ మందు ఇస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరిపైనా అయిన అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని సీపీ శ్రీనివాస్ అన్నారు.
Read also: MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
పార్టీలకు వెళ్లే యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలిసో తెలియకో ఎవరో ఒకరు డ్రగ్స్ ను అలవాటు చేసేందుకు పాల్పడుతుంటారని అన్నారు. కూల్ డ్రింక్స్ లో కలుపుతారని.. కాబట్టి యువత పార్టీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల కోసం TSNAB ప్రత్యేకంగా ఒక కిట్‌ను రూపొందించింది. డ్రగ్స్ వినియోగదారులు, గంజాయి వినియోగదారులను గుర్తించడానికి ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కిట్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!