రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్‌చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది.