Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలం పోత్నూర్‌లో యువకునికి బంగారం నాణేలు పేరుతో రూ.7 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికాయనీ, తక్కువ ధరకు ఇస్తానంటూ మహేష్ అనే వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. కుండలో బంగారు నాణేలు దొరికాయని నమ్మబలికాడు. దీంతో నిజమేనని నమ్మని మహేష్ అవి తీసుకుని అమ్ముకుంటే ఎక్కవ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. నాణేలు ఎంతకు వస్తాయని మహేష్ అడగగా రూ.7 లక్షలకు ఇస్తానని కేటుగాడు బేరమాడాడు.
Read also: Honda Activa 125cc: కొత్త లుక్‌తో ఆక్టివా 125 స్కూటర్.. ఫీచర్లు ఇలా
దీంతో చవకగా వస్తున్నాయని అవి తీసుకుని లక్షల్లో అమ్ముకోవచ్చని అతి ఆశకు పోయాడు. అయితే ఆ నాణేలు కావాలంటే బెంగళూరు సి-మార్కెట్‌కు రావాలని కేటుగాడు తెలిపాడు. దీంతో మహేష్ నిజమని నమ్మి బెంగళూరు సి మార్కెట్‌కు వెళ్లాడు. గ్రాము ఒరిజినల్ బంగారం ఇచ్చి పరీక్షించుకోవాలి ఎరవేశాడు. అది చూసి మహేష్ అంతా నిజమైన బంగారం అని నమ్మాదు. దీంతో మహేష్ అతనికి తన వద్ద వున్న రూ.7 లక్షలు ఇచ్చాడు. మహేష్ ఇంటికి వచ్చి పరీక్షించగా నకిలీ బంగారంగా తేలడంతో పోలీసులకు బాధితుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్