Harish Rao: బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం!
- బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
- అఖిలపక్షం మీటింగ్ ను రాజకీయాలకు వేదికగా మార్చారు..
- బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం: హరీశ్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, బనకచర్ల ఏ బేసిన్ లో ఉందని సీఎం అడుగుతున్నాడు.. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అని అంటే ఆయనకు అర్థం కావట్లేదు.. అఖిలపక్షం మీటింగ్ ను రాజకీయాలకు వేదికగా మార్చారు అని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టుల ఎక్కడ కట్టారా కూడా తెలియదు.. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ ల గురించి తెలుసుకోవడం అనేది సీఎం తెలుసుకోవాలని సూచించారు. నల్లమల పులిబిడ్డ అని చెప్పే రేవంత్ రెడ్డికి.. అది ఆంధ్రనా, తెలంగాణ నా తెలియదు అని హరీశ్ రావు విమర్శించారు.
Read Also: Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!
Also Read
ఇక, నా ప్రెస్ మీట్ తర్వాతనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీలతో లేఖలు విడుదల చేస్తున్నారు అని హరీశ్ రావు పేర్కొన్నారు. నిన్న సీఎం మాట్లాడిన మాటలు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉందన్నారు. గోదావరి నుంచి 1000 టీఎంసీలు తీసుకోండి అని ఎలా చెబుతావు అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడా.. బేసిక్ నాలెడ్జి కూడా లేకుండా మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. 2.10.2020లో కేంద్ర మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు.. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల నీళ్లలో 1950 టీఎంసీల నీళ్లు కావాలని ఆ లేఖ రాశారు అని తేల్చి చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పుట్టినవ్ అని చెప్తావ్.. కృష్ణానది గురించి కూడా తెలియదు అని సీరియస్ అయ్యారు. సీఎంని ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా మాట్లాడినందుకు ఉరి తీసినా తప్పు లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్లు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ పోరాటం చేశారు.. సెక్షన్ 3ని సాధించారు.. కేసీఆర్ జీవితం అంతా నీళ్ల కోసమే పోరాడారని హరీశ్ రావు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!