Ganja Gang: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కార్ అద్దాలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన యజమానితో ఈ పొకిరి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. ఈ సందర్భంగా నాకు పగలగొట్టాలని అనిపించింది అందుకే పగలగొట్టాను, ఎక్కువగా మాట్లాడితే కారు మొత్తం తగలబెడతానని ఉల్టా బెదిరింపులకు ఈ గంజాయి బ్యాచ్ దిగింది. ఇక, అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ హల్ చల్ చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు చెప్పగా స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం ఇచ్చారు. ఇక, పోలీసుల తీరుపై ఎర్రబొడ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.
Read Also: Suicide: రెండేళ్ల కుమార్తెతో ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య
అయితే, ఎర్రబొడలో బీరప్ప గుడి మెట్లపై మద్యం సేవించి అక్కడే బీర్ బాటిల్స్ ను ఈ గంజాయి బ్యాచ్ పడేసింది. ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో పలుమార్లు వీళ్లు రెచ్చిపోయారు. పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. వెకిలి చేష్టలతో మహిళలు, యువతులకు వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు.