హైదరాబాద్ లోని పాత బస్తీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత తన రేండేళ్ల కూతరితో ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. బహదూర్ పురలో వ్యాపారం చేస్తున్న పృధ్వీలాల్, అతడి భార్య కీర్తిక అగర్వాల్. వీరికి రెండేళ్లు కుమార్తె బియ్యారా ఉంది. అయితే.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో.. ఆమె రెండేళ్ల నుంచి తమ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈనెల 2న రెండేళ్ల కూతురుతో కలిసి కీర్తిక అగర్వాల్ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్ రోడ్డులోని నీరా కేప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. వివరాలు లభించకపోవడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Read Also:Shocking Video: పామునే ముప్పు తిప్పలు పెట్టించిన ఓ కీటకం
గత వారం క్రితం తమ కూతురు, మనవరాలు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు కీర్తిక తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కీర్తిక అగర్వాల్ గా గుర్తించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే మంగళవారం పాప డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. తల్లి కూతుర్ల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాలను కీర్తిక తల్లిదండ్రులకు అప్పగించారు. ఆత్మహత్య చేసుకున్న కీర్తిక అగర్వాల్(28) ఓ ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో చార్టెడ్ అకౌంట్ గా పని చేస్తుంది. అయితే కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కీర్తిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.