Hyderabad Crime: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కాల్పుల కలకలం రేపింది. పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు. పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయారు. గంజాయి ముఠాను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వారి వద్దనుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: TG Govt Stop Cellars: ప్రభుత్వం సంచలన నిర్ణయం..! ఇక సెల్లార్లకు గుడ్ బై..?
గంజాయి పై ఉక్కు పాదం మోపిన పోలీసులు పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ కు వెళ్లారు. అయితే పోలీసులను చూసిన గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ముఠాను ఆపేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గంజాయి ముఠా పోలీసులపై ఎదురుదాడికి దిగి.. పోలీసుల కళ్లుగప్పి పరార్ అయ్యింది. ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసుల పరుగులు పెట్టారు. ఎట్టకేలకు గంజాయి ముఠాను అదుపులో తీసుకున్నారు. పరుగులు పెట్టిన గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. తుపాకీ మోతలకు స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఆందోళనకు గురయ్యారు. అయితే గంజాయి ముఠాను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు తెలిపారు.
Oral cancers: ఈ అలవాట్లుంటే వెంటనే మానండి.. లేకపోతే కాన్సర్ తప్పదు సుమీ..