Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Former Minister Harish Rao Clarity On Dubai Tour

Harish Rao: దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు

Published Date :March 3, 2025 , 12:45 pm
By Suresh Maddala
  • దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు
  • మాజీ మంత్రి హరీశ్‌రావు క్లారిటీ
Harish Rao: దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.

దుబాయ్ టూర్‌పై అబద్ధాలు..
నేను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. నా మిత్రుడి కూతురు పెళ్లి వేడుకకు వెళ్లాను. నేను ఫిబ్రవరి 21వ తేదీన దుబాయ్‌కి వెళితే 22 ఉదయం ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగింది. అయినా ప్రభుత్వంలో ఉన్న మీరు రెస్క్యూ పనులు చేయాలి. కానీ మమ్ములను అంటే ఎలా? గతంలో కూడా కాళేశ్వరం విషయంలో ఇలాగే మాట్లాడారు. మాకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారు. ఇప్పుడు కూడా మీ వల్ల కాదు అంటే చెప్పండి.. మేము రెస్క్యూ చేసి చూపెడతాం. పది రోజులు అయినా డెడ్ బాడీలు ఇంకా బయటకు తీయలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత కచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించాలి. మేము వెళితే టన్నెల్ వరకు రానీయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వెళితే మాత్రం దగ్గరుండి చూపించారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన విషయంలో ముఖ్యమంత్రికి సీరియస్‌నెస్ లేదు. అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వెళ్లారు. ఈ విషయాలు అన్ని అసెంబ్లీలో ఎండగడతాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మోడీ సఫారీ.. ప్రకృతిని కాపాడాలని పిలుపు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • cm reavnth reddy
  • congress
  • dubai tour

తాజావార్తలు

  • TGSRTC ఉద్యోగులకు షాక్.. ఆ ఇంక్రిమెంట్ నిలిపివేత..!

  • RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!

  • Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!

  • Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’

  • sreeleela : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions