NTV Telugu Site icon

Harish Rao: దుబాయ్ టూర్‌పై రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారు

Harish Raotv

Harish Raotv

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.

దుబాయ్ టూర్‌పై అబద్ధాలు..
నేను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. నా మిత్రుడు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకకు వెళ్లాను. నేను ఫిబ్రవరి 21వ తేదీన దుబాయ్‌కి వెళితే 22 ఉదయం ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగింది. అయినా ప్రభుత్వంలో ఉన్న మీరు రెస్క్యూ పనులు చేయాలి. కానీ మమ్ములను అంటే ఎలా? గతంలో కూడా కాళేశ్వరం విషయంలో ఇలాగే మాట్లాడారు. మాకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారు. ఇప్పుడు కూడా మీ వల్ల కాదు అంటే చెప్పండి.. మేము రెస్క్యూ చేసి చూపెడతాం. పది రోజులు అయినా డెడ్ బాడీలు ఇంకా బయటకు తీయలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత కచ్చితంగా డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించాలి. మేము వెళితే టన్నెల్ వరకు రానీయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వెళితే మాత్రం దగ్గరుండి చూపించారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన విషయంలో ముఖ్యమంత్రికి సీరియస్‌నెస్ లేదు. అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వెళ్లారు. ఈ విషయాలు అన్ని అసెంబ్లీలో ఎండగడతాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.