ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.