Telangana: జిల్లాలను కమ్మేసిన పొగమంచు.. హెడ్ లైట్ల వెలుతురులో ప్రయాణం..
- మంచుదుప్పటి కప్పుకున్న తెలంగాణ..
- పల్లెలే కాదు కశ్మీరాన్ని తలపిస్తున్న జిల్లా కేంద్రాలు..
- వాహనదారులు- పాదచారులకు ఇబ్బందిగా మారిన ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారిపై హెడ్ లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
Read also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పొగమంచు కురుస్తుంది. ఉదయం 6.30 గంటలైనా జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారి కనపడటం కష్టంగా మారింది. దీంతో వాహనదారులు హెడ్ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఎదుట పొగమంచు కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాని పొగమంచు కమ్మేసింది. సంగారెడ్డి, కంది, రుద్రారం, జోగిపేట, చౌటకూర్ ప్రాంతాల్లో మంచు దట్టంగా కమ్మేసింది. ఔటర్ రింగ్ రోడ్డు, NH-65, NH-161 పై వాహనాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వాహనాల హెడ్ లైట్ లు, ఇండికేటర్ వేసుకుని వాహనదారులు నెమ్మదిగా వస్తున్నాయి. స్కూల్, ఉద్యోగాలకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read also: Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..
మరోవైపు పటాన్చెరు, రామచంద్రపురం, లింగంపల్లి ,అవుటర్ రింగ్ రోడ్డు ,ముత్తంగి, ఇస్నాపూర్ లో పొగ మంచు కమ్మేసింది. వాహనదారులు తమ వాహనాలకు లైట్లు ఆన్ చేసుకొని నడుపే పరిస్థితి వచ్చింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు పాదచారులు కనిపించడం కష్టంగా మారింది. విద్యార్థులకు స్కూల్ టైం, ఆఫీస్ వాళ్లకు జాబ్ టైం రోడ్డు క్రాస్ చేయాలంటే పొగ మంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయవలసి వస్తుంది. వికారాబాద్ జిల్లాలో భారీగా మంచు కమ్మేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!