Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. 16 సీట్లు గెలవాల్సిన చోట 8 సీట్లు గెలిచిందని అన్నారు. గత ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగులే అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కహామీ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించిన ప్రభుత్వం పడేసి తంతుందన్నారు. ఆయా యూనివర్సిటీల్లో నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరుద్యోగుల నిరసనలను పోలీసులు అణచివేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మోత్కుపల్లి పేర్కొన్నారు. ప్రజలలో లేని వాడికి… కోట్లు ఉంటే చాలు టికెట్లు వస్తున్నాయన్నారు.
Read also: Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ ను రూ. 32 కోట్లతో అభివృద్ధి..
టికెట్ల విషయంలో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. పరిపాలించే వ్యక్తి నైజాన్ని బట్టి.. టికెట్లు పదవులు ఉంటాయి, వస్తాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందేందుకు కృషి చేశానన్నారు మాజీ మంత్రి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 80 లక్షల మంది దళితులకు ఒక్క టిక్కెట్టు ఇవ్వలేదన్నారు. చిత్తశుద్ధితో దళితుడైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల టిక్కెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం బీసీలను పట్టించుకునే కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు తన ఫోటోను ఉంచారు. కానీ ఉపముఖ్యమంత్రి భట్టి ఫోటోను రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
VenkyAnil3 : తొలి షెడ్యూల్ మొదలెట్టేసిన వెంకీ76 సినిమా..