CM Revanth Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
Read Also: Delhi : ఢిల్లీలో డెంగ్యూ మరణం నమోదు.. ఇప్పటివరకు 650కి పైగా కేసులు నమోదు
కాగా, వాస్తవానికి గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్ బయట కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Ganesh Immersion 2024: హుస్సేన్ సాగర్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్.. కనిపించని పోలీసులు..!
అయితే, సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఇటీవలి భూమి పూజ కూడా చేశారు సీఎం రేవంత్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పని చేసిన ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం, సెక్రటేరియెట్ మధ్యలో ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.