CMRF: చిన్నారి వేదవల్లి కుటుంబానికి సీఎం ఆర్థిక చేయూత..
- చిన్నారి వేదవల్లి కుటుంబానికి ఆర్థిక చేయూత..
- బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిన వేదవల్లి...
- వేదవల్లి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMRF: అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని పరీక్షల్లో తేలడంలో.. తల్లిదండ్రుల జీవితాలు పిడుగుపడినట్టు అయ్యింది.. పాపను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించారు. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ. 8 లక్షలు మంజూరు చేశారు. అయితే, వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయాలని సీఎం శ్రీరేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఆ మొత్తాన్ని విడుదల చేశారు…
Read Also: Shehbaz Sharif: సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పాక్ ప్రధాని.. కారణమిదేనా?
Also Read
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. రఘు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రఘు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వేదవల్లికి (5) 2022లో తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్ క్యాన్సర్ (అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లార్జ్ లింఫోమా) అని తేల్చారు. పాపను రక్షించుకునేందుకు రెండేళ్ల పాటు తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. చికిత్స వ్యయం నానాటికీ భారంగా మారడంతో 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వేదవల్లి చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలను మంజూరు చేశారు. చికిత్స అందించినప్పటికీ అప్పటికే వ్యాధి తీవ్రత పెరగడంతో గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు గతంలో ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంజూరు చేసిన రూ.7 లక్షల చెక్కును సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు వేదవల్లి తండ్రి రఘుకు గురువారం రోజు సచివాలయంలో అందజేశారు.
తాజావార్తలు
-
FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!