Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో పుట్టిన విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చి సిల్క్ స్మిత అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆమెపై అభిమానానికి హద్దులు ఉండేవి కావు. తెలుగు, తమిళ భాషల్లో అయితే విడుదల కాకుండా ఆగిపోయిన కొన్ని సినిమాలు కూడా ఆమెతో ప్రత్యేకంగా ఒక పాట చిత్రీకరించి జోడించిన తర్వాత బిజినెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఆమె పాటల కోసమే థియేటర్స్ కి వచ్చే జనాలు గట్టిగా ఉండేవారు. ఆమె పాటల వల్ల హిట్ అయిన సినిమాలూ చాలానే ఉండేవి. కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా 1996లో ఆమె జీవితం విషాదాంతమైంది. అయితే ఆమె చనిపోయే ముందు రాసుకున్న సూసైడ్ నోట్ అప్పట్లో పత్రికల్లో కూడా అచ్చయింది. ఒక సోషల్ మీడియా యూజర్ దానిని పోస్ట్ చేయడంతో ఇప్పుడు మరోసారి వైరల్ అయింది.
లెటర్ యధాతధంగా ….
Also Read
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
“అభాగ్యురాలు 22/9/1996
దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నా మీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసారు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజూ టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును. అంటూ ఆమె తన ఆవేదన అంతా ఒక లేఖలో రాసి బలవన్మరణానికి పాల్పడింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
-
Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!