అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని పరీక్షల్లో తేలడంలో.. తల్లిదండ్రుల జీవితాలు పిడుగుపడినట్టు అయ్యింది.. పాపను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించారు. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ. 8 లక్షలు మంజూరు చేశారు. అయితే, వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయాలని సీఎం…
CM Revanth Reddy : క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ (6), స్మయ (2 నెలలు), తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు…
Blood Cancer: అత్యంత తీవ్రమైన క్యాన్సర్లలో ‘బ్లడ్ క్యాన్సర్’ ఒకటి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వైద్యులు కీమోథెరపీని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, చండీగఢ్ వైద్యులు మాత్రం కీమోథెరపీ ఉపయోగించకుండా ఒక రకమైన రక్త క్యాన్సర్ చికిత్సను కనుగొన్నారు. అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (ఏపీఎల్)తో బాధపడుతున్న రోగులు చికిత్స తర్వాత పూర్తిగా నయమయ్యారని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యులు తెలిపారు.
Haridwar: ఉత్తరాఖండ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.