తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.. అయితే, ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.. తలరాత మార్చమని ప్రజలు అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు..
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో…
CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు.