తొంభైల నాటి కాలంలో దక్షిణాది చిత్రపరిశ్రమ మొత్తం మద్రాస్‌లో ఉండేది. ఎక్కువ షూటింగ్స్ కూడా తమిళనాడులో జరిగాయి. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్‌ను తలదన్నేలా మిగిలిన చిత్ర పరిశ్రమలు ఎదిగాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ విలువలే కాదు బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలొస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరోలతో బిగ్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఇతర ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. రీసెంట్లీ ఈ పంథా ఊపందుకుంది. టాలీవుడ్, శాండిల్ వుడ్ నిర్మాణ సంస్థలు కోలీవుడ్ స్టార్లతో చిత్రాలను తెరకెక్కిస్తున్నాయి.
Also Read : Kavya : హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న బ్యూటీ
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఇళయ దళపతి విజయ్ వారిసుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళ తంబీలతో టచ్‌లోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 10న రిజల్ట్ తేలనుంది. నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్- కీర్తిశ్వరన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించింది మైత్రీ. ఇక ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ధనుష్- వెంకీ అట్లూరి సార్ మూవీతో కోలీవుడ్ ఎంటరయ్యాయి. నెక్ట్స్ సూర్య- వెంకీ ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టనుంది సితార ఎంటర్మైన్మెంట్.
Also Read : NTRNeel : ‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?
టాలీవుడ్ మాత్రమే కాదు కన్నడ నిర్మాణ సంస్థలు కూడా తమిళ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రముఖ శాండిల్ వుడ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఇప్పటికే రఘుతాతతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఇళయ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్‌ను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతుంది కేవిఎన్ ప్రొడక్షన్స్. అలాగే కార్తీ, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఖైదీ 2కి కూడా కో ప్రొడ్యూసింగ్ చేస్తున్నట్టుగా టాక్. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు చెందిన యాక్టర్లను తీసుకుంటే అరిచి గీ పెట్టిన కోలీవుడ్ ఇప్పుడు పరభాషా నిర్మాతలకు ఆశ్రయమిస్తుండడం మంచి పరిణామమే.