ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాలలకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్సీలను మూడు కేటగిరీలుగా చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దేని ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి. జనాభా ప్రకారం అయితే మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చారు. బుడగజంగాలను ఏ గ్రూప్‌లో కలిపారు. నేతకాని సామజిక వర్గం వారిని సీ గ్రూప్‌లో ఉంచారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరీల్లో వివేక్ వెంకటస్వామి హస్తం ఉంది. మల్లిఖార్జున ఖర్గే, కొప్పుల రాజు, భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి లాబీయింగ్‌కు రేవంత్ రెడ్డి లొంగారు.’’ అని రాజయ్య ఆరోపించారు.
ఇది కూడా చదవండి: YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. నలుగురిపై కేసు నమోదు
‘‘ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం జరగాలి. దామోదర రాజనర్సింహా మాదిగలకు అనుకూలంగా లేరు. కేటగిరీలో ఉన్న కులాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రిజర్వేషన్ల కోసం మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లు పోరాటం చేశారు. ఏ కమీషన్ అయినా మాదిగలకు అన్యాయం జరిగినట్లు చెప్పింది. తాజాగా షమీమ్ అక్తర్ కమిటీ అదే రిపోర్ట్ ఇచ్చింది.’’ అని రాజయ్య పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mastan Sai: మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్స్ పార్టీలు?