గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్‌బీ నగర్ జోన్‌లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి కేటీఆర్ సార్ మీకు ఒక విన్నపం హైదరాబాద్ మేయర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలున్ని పీక్కుతిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేలకుక్కలని మేయర్ ఇంట్లో వదిలేయాలని కోరారు.
హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ బుక్‌లెట్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని, సీఆర్ఎంపీ కింద…