దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.
బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్‌లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.