వామికా గబ్బీ రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చిన ‘బేబీ జాన్’ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టరైనా మేడమ్ ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ఇక థియేటర్లలోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకు వచ్చిన ‘భూల్ చుక్ మాఫ్’ కూడా యావరేజ్ హిట్. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్‌పై ఎటువంటి ఎఫ్టెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్స్ అయ్యాయి. భారీ సక్సెస్‌లు లేకపోయిన క్రేజీ ఆఫర్స్ ఎలా కొల్లగొట్టొచ్చో నిరూపిస్తోంది ఈ బ్యూటీ.
Also Read : Akkineni King : అక్కినేని నాగార్జున100వ చిత్రం ‘లాటరీ కింగ్’
వామికా లైనప్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్టులను మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఒకటి కాదు పది ప్రాజెక్టులను లైన్లో పెట్టేసింది. ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో నటించే ఆఫర్స్ కొల్లగొడుతోంది. ‘దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్, అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’, ‘పతి పత్ని ఔర్ ఓ2’తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ‘రక్త బ్రహ్మాండ్’ లో కీ రోల్ ప్లేచేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ధర్మ ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కించే ఓ ప్రాజెక్టులో కూడా ఫైనల్ అయినట్లు టాక్. బాలీవుడ్‌లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బీ. తెలుగులో ‘భలే మంచి రోజు’ వచ్చిన పదేళ్ల తర్వాత అడివిశేష్ క్రేజీయెస్ట్ మూవీ ‘గూఢచారీ2’ లో కనిపించబోతుంది ఈ నయా సెన్సేషన్. నెక్ట్స్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళంలో జీని అనే భారీ బడ్జెట్ చిత్రంలో పాటు ఇరవకాలంలో యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో ‘టికీ టాకా’లో నటిస్తోంది. ఇలా ఇంచు మించు పది ప్రాజెక్టులతో ఇతర హీరోయిన్లకు కూడా లేని లైనప్‌తో ఫుల్ స్వింగ్ లో ఉంది వామికా గబ్బీ.