Group1 Prelims Results: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ..
- తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది..
- అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష విద్యార్థులకు హెచ్చరిక. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది. అనంతరం ఫలితాలను వెల్లడించారు. అయితే.. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. కాగా..రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 13న ప్రాథమిక కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Read also: Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
కాగా, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని ఎంచుకోవాలని నిరుద్యోగులు గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 5న కూడా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే 1:50 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ అభ్యర్థనను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే జరిగితే ఉద్యమాలు ఉధృతం చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటిస్తున్నారు.
Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జియో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందరికీ న్యాయం జరిగేలా గతంలో మాదిరిగానే జీవో 55ని అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..