Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్ వికటించి వివాహిత మృతి..
- నాచారం శివ నర్సింగ్ హోమ్ లో దారుణం..
- ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వచ్చిన బండి సంధ్య వైద్యం వికటించి మృతి..
- హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Nursing Home: వైద్యం వికటించి బండి సంధ్య అనే మహిళ మృతి చెందిన ఘటన నాచారం రాఘవేంద్ర నగర్ లోని శివ నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
మల్లాపూర్ కి చెందిన బండి సంధ్య కి ఇద్దరు పిల్లలు, భర్త ప్రవైట్ ఉద్యోగి. కాగా సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పండంతో ఆసుపత్రి డాక్టర్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపాడు. అయితే అప్పటి నుంచి సంధ్యకు కడుపులో నొప్పి రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం జరగడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సంధ్యను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్కానింగ్ చేసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి రాక ముందు వేరే ఆసుపత్రికి వెళ్లారా అని ప్రశ్నించగా సంధ్య అవును ఫ్యామిలీ ప్లానింగ్ కోసం శివ నర్సింగ్ హోమ్ కు వెళ్లి నట్లు తెలిపింది.
Also Read
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Read also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్
దీంతో కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలిపారు. సంధ్య బతకడం చాలా కష్టమని తెలిపారు. అయితే అయినా వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యం చేసిన కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ కారణంగా సంధ్య మృతి చెందింది. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సరిగా చేయలేదని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వలనే సంధ్య మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. డాక్టర్స్ పై తగు చర్యలు తీసుకోవాలి అని బంధువుల డిమాండ్, హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు మృత దేహాన్ని కదిలించేది లేదని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫ్యామిలీ ప్లానింగ్ కు వస్తే పరలోకానికి పంపారని కుటుంబ సభ్యులు రోదించారు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!