Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
- నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్
- 19 రోజుల బ్యాటరీ బ్యాకప్
- వైర్లెస్, వైర్డ్ FM రేడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో HMD మరో కొత్త నోకియా ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ Nokia 123 Shield పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. తక్కువ ధరలో నమ్మకమైన బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్నవారితో పాటు, బయట ఎక్కువ సమయం పనిచేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లోని ప్రధాన ఆకర్షణ నీరు, ధూళి నుంచి రక్షణ కలిగిన బలమైన డిజైన్, 19 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్.
Nokia 123 Shield ధర
HMD ఇంకా Nokia 123 Shield అధికారిక గ్లోబల్ ధరను ప్రకటించలేదు. అయితే బల్గేరియా, గ్రీస్ దేశాల్లోని రిటైల్ లిస్టింగ్‌ల ప్రకారం ఈ ఫోన్ ధర 35-40 యూరోల మధ్య ఉండే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఉండొచ్చు.
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
Nokia 123 Shield స్పెసిఫికేషన్లు
Nokia 123 Shieldలో 2.4 అంగుళాల QVGA డిస్ప్లేను అందించారు. ఫోన్‌కు గరుకుగా ఉండే ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చేతిలో సులభంగా పట్టుకునేలా ఉంటుంది. నీరు, దుమ్ము, ఇసుక లోపలికి వెళ్లకుండా ఉండేందుకు USB పోర్ట్, ఇతర కనెక్టివిటీ పోర్ట్‌లను ప్రత్యేక రబ్బరు ఫ్లాప్‌లతో కప్పారు.
ముఖ్య ఫీచర్లు
2.4-అంగుళాల QVGA డిస్ప్లే
S30+ ఆపరేటింగ్ సిస్టమ్
Unisoc SC6531E ప్రాసెసర్
4MB RAM
4MB ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ విస్తరణ
USB Type-C పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Nokia 123 Shieldలో QVGA రియర్ కెమెరా, LED ఫ్లాష్ అందించారు. సాధారణ ఫోటోలు, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేందుకు ఇది సరిపోతుంది.
19 రోజుల బ్యాటరీ బ్యాకప్
ఈ ఫీచర్ ఫోన్లో 1,750mAh రిమూవబుల్ బ్యాటరీను అందించారు. కంపెనీ ప్రకారం 27.9 గంటల వరకు టాక్‌టైమ్, 19 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాకప్ లభిస్తుంది. తరచుగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
ఇతర ఫీచర్లు
Nokia 123 Shieldలో పలు ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
వైర్లెస్, వైర్డ్ FM రేడియో
బిల్ట్-ఇన్ ఫ్లాష్‌లైట్
డ్యూయల్ మినీ సిమ్ సపోర్ట్
కేవలం 2G నెట్వర్క్ సపోర్ట్
బరువు 108 గ్రాములు
గ్రీన్, పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..