Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: భారత్-జింబాబ్వే మధ్య ఈ రోజు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 6,000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి మరో 16 పరుగులు మాత్రమే అవసరం. ఈ మైలురాయిని అందుకుంటే 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్‌లు ఆడి 5,984 పరుగులు చేశాడు. ఇందులో భారత్ తరఫున 53 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. జింబాబ్వేపై తొలి టీ20లో 16 పరుగులు చేస్తే తన 200వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకుంటాడు.
ఈ జాబితాలో ప్రస్తుతం కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ల్లో, శుభ్‌మన్ గిల్ 185 ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఈ ప్రత్యేక క్లబ్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లో 6,000 టీ20 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 165 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో జింబాబ్వేతో తొలి టీ20లో అభిషేక్ శర్మ ఈ అరుదైన రికార్డును అందుకుంటాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!