Chandrababu and Revanth Reddy Meeting: రేపే ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. వీటిపైనే ఫోకస్..!
- రేపే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..
- హైదరాబాద్ వేదికగా తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్ సీఎంల భేటీ..
- కీలక అంశాలపై సాగనున్న చర్చలు..
- అజెండాపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన రెండు రాష్ట్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Revanth Reddy Meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు.. ఈ రోజు హస్తిన పర్యటన ముగించి.. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, రేపు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు ఏపీ సీఎం.. దానికి అంగీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి.. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Odisha : జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణం ఎప్పుడు ఓపెన్ అవుతుంది… దాని వెనుక రహస్యం ఏమిటి?
Also Read
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.. షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన.. ఆస్తుల పంపకాల వంటివి ఇంకా తేలాల్సి ఉంది. ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన వ్యవహరంగా ఉంది. అలాగే ట్రాన్సుకో, ఉన్నత విద్యా మండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వచ్చినా.. ఏపీకి కాస్తో కూస్తో ఆర్థిక ఊరట ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల భావనగా ఉందట… దీంతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు.. డిస్కంలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గొడవ వంటివి కూడా సీఎంల భేటీలో ప్రస్తావనకు తెచ్చేలా ఏపీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Delhi: నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్ ఇవ్వండి: కేజ్రీవాల్
మరోవైపు, ఇప్పటికీ కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ అనే రీతిలో పని చేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పని చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతోన్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. ఈ విషయం మీద సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యం.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతి అంశంలోనూ గొడవలు పడుతూ ఉంటే.. కేంద్రం జోక్యం అనివార్యమవుతుంది. దీంతో పరిస్థితి మరింత జఠిలం కావడం తప్ప.. సమస్య సులువుగా పరిష్కారం కాదనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. దీంతో ముందుగా ఈజీగా సాల్వ్ అయ్యే పరిష్కారాలేంటో చూసుకుని.. వీలైనంత త్వరగా మెజార్టీ సమస్యలను పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందట.. అయితే, ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు.. ఇంకా ఎవరెవరు పాల్గొంటారు.. అజెండా ఏంటి అనేదానిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!