Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Star Mahesh Babu New Look: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ నాటికి సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్ బాబు తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. తాజాగా సూపర్ స్టార్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వారణాసి కోసం మహేశ్ బాబు ఇంతకాలం ఫుల్ గడ్డం, పొడవాటి హెయిర్‌తో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ వచ్చారు. సినిమాలోని పాత్రకు అనుగుణంగా ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్ దశ ముగింపు దిశగా సాగుతుండటంతో.. బాబు మళ్లీ తన క్లీన్ షేవ్, స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లోకి వచ్చారు. చాలా రోజుల తర్వాత బాబును ఇలా క్లీన్ షేవ్ లుక్‌లో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. మహేశ్ తన సాధారణ స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఏమున్నాడ్రా బాబు’, ‘సూపర్ స్టార్ సూపర్బ్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
మహేశ్ బాబు లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడంతో వారణాసిలో శ్రీరాముడి పాత్రకు సంబంధించిన సన్నివేశాల కోసమే ఈ గెటప్ మార్చుకున్నారా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. వారణాసిలో బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పౌరాణిక అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా వైరల్ అవుతున్న మహేశ్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఏదేమైనా బాబు నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్, లుక్స్, టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
*Clean Shaving Ela Undii ” ani Mana Babu Adguthunnadu 😍❤️#MaheshBabu | #Varanasi pic.twitter.com/XZT3RGo6i6
— Hari SaaHo (@HariSaaho19) September 25, 2026
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!