ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోజూ ఏదో ఒక చోట స్రీలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చిన్నా పెద్ద తేడాలేకుండా తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. మొన్నటికి మొన్న అమ్నిషియా పబ్ మైనరల్ బాలిక సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే.. ఓ బాలికను బర్త్‌డే పార్టీ అని పిలిచి కారులోనే అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాలో పరిచయం పెంచుకొని ఓ అమ్మాయిని రూమ్ పిలిపించమే కాకుండా ఆమెపై అత్యాచారం చేసి.. దానికి చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారంకు పాల్పడ ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
Car Accident : యువతిని ఢీకొట్టిన కారు.. కానీ..
ఇప్పుడు మరో దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ14 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.