Yadagirigutta : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఐదు కొత్త ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సేవలు వైకుంఠ ఏకాదశి నుంచే కాకుండా ఫిబ్రవరి మాసం నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రవేశపెట్టనున్నారు. ఈ సేవ ప్రతి బుధవారం…
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. రేపటి నుంచి(జూలై 01 2025) ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 31 2025 వరకు ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను నిలిపేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ వారు భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం నల్లమల అడవులలో ఉంది. భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఈ…
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక…
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు…
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘‘మహా కుంభమేళా’’ ముగిసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా, దేశ విదేశాల నుంచి ‘త్రివేణి సంగమం’’కి భక్తులు పోటెత్తారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ హిందూ కార్యక్రమానికి ఏకంగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Kedarnath Helicopter Service : ప్రతేడాది లక్షలాది మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటారు. అయితే, ఈసారి కేదార్‌నాథ్ యాత్ర ఖరీదైనదిగా ఉండబోతోంది.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల నిర్ణయ ప్రకారం, రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేస్తారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ధనుర్మాస ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబందించిన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుప్పావైతో మేల్కొలుపు: ధనుర్మాస సమయంలో సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాశురాలు…
Kishan Reddy : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో మహా కుంభమేళా ఒకటి. ఈసారి కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జరగనుంది. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా…
Char Dham Yatra: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు.