Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
- 25 కిలోల బస్తాపై 26 కిలోల లేబుల్‌తో మోసం
- ఎంఆర్పీ మార్చి అధిక ధరలకు విక్రయాలు
- రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు
- 18 సంస్థలపై చర్యలు.. 11 ఎఫ్ఐఆర్లు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బియ్యం ధరల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. కృత్రిమ కొరత సృష్టించడం, బస్తాల బరువులో తేడాలు చూపించడం, అసలు ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. అక్టోబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. వీరిలో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 11 పోలీస్ కేసులు నమోదు చేశారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో అధికారులు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను మోసం చేసేందుకు అనుసరిస్తున్న పద్ధతులను గుర్తించారు. ముఖ్యంగా 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా ముద్రించిన లేబుళ్లు వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బియ్యం కంపెనీలు ముద్రించిన అసలు గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ని తొలగించి, ఎక్కువ ధరలతో కొత్త స్టిక్కర్లు అతికిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. దీంతో వినియోగదారులు అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read
- Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
- Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
- Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
- Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
మరోవైపు పలువురు వ్యాపారులు కనీస అనుమతులు లేకుండానే బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, కార్మిక శాఖ అనుమతులు, ఆహార భద్రత శాఖకు సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండానే దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. కొందరు వ్యాపారులు పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యవహారాన్ని కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.
ఈ అక్రమాలపై అధికారులు కఠిన చర్యలకు దిగారు. సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. నిందితులపై నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరాలు రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రజలకు నిత్యావసర సరుకులు సరైన ధరలకు, నాణ్యంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. బియ్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని హెచ్చరించింది. తూకంలో మోసాలు చేయడం, ధరల విషయంలో వినియోగదారులను మభ్యపెట్టడం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!