రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని…
మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే "మీసేవ"ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
CM Chandrababu: సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరల నియంత్రణకు వీలైనన్ని మార్గాలు అన్వేషించాలన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడం మంచి పరిణామమన్నామని పేర్కొన్నారు.
Nadendla Manohar: కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.