Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
- కాంగ్రెస్ సభపై అమిత్ షా తీవ్ర విమర్శలు
- చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తామని హెచ్చరిక
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు
- బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాన్ని అంతం చేయండి’ (లోక్తంత్ర బచావో – అరాజకతా హటావో) మహాపాదయాత్ర , బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ‘భారత్ మాతాకీ జై’, ‘జైశ్రీరామ్’ నినాదాలతో తమ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, పాతబస్తీలోని శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారిని, భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. నాడు సర్దార్ పటేల్ గనుక నిజాం నిరంకుశ పాలనను లొంగదీసుకోకపోతే హైదరాబాద్, తెలంగాణ భూభాగం ఈరోజు భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి కావని నొక్కి చెప్పారు. అలాగే గిరిజన విప్లవ వీరులు కొమరం భీమ్, రామ్‌జీ గోండ్ల అమరపోరాటాలను ఈ సందర్భంగా కొనియాడారు.
అది ‘ఓట్ బచావో’ కాదు ‘చొరబాటుదారుల రక్షణ’ సభ
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సభపై అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నది ఓటర్ల పరిరక్షణ ర్యాలీ కాదని, ఓటర్ల జాబితాలోకి చొరబడిన అక్రమార్కులను కాపాడేందుకు ఆ పార్టీ పన్నుతున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 13 కోట్ల ఓట్లు రద్దయ్యాయంటూ దొంగ ప్రచారాలు చేస్తోందని, నిజానికి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరున్నర కోట్ల మంది ఓటర్ల పేర్లను నిబంధనల ప్రకారమే సవరించారని వివరించారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఎంతగా అడ్డుపడినా, చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా ఈ దేశం నుంచే వెళ్లగొడతామని హెచ్చరించారు.
Also Read
- BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాలి.. తెలంగాణలో మార్పు రావాలి
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి, అరాచక పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజలు ఆలోచించి మద్దతు తెలపాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్‌ను మలుపుతిప్పారు’
-
CM Vijay: రైతుల కన్నా హెయిర్స్టైల్పైనే ఎక్కువ శ్రద్ధ.. సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే విమర్శలు!
-
Mythri Movie Makers: తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం.. స్టాక్ మార్కెట్ (IPO) బాట పట్టబోతోన్న మైత్రీ మూవీ మేకర్స్
-
Anil Ravipudi-NTR: ఎన్టీఆర్‌తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
-
Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!