తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు బాలీవుడ్ మెగా స్టార్లు రానుండటం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ వేదికకు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ హాజరు కానున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇద్దరు నటులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం హర్షోల్లాసంగా ఈ సమ్మిట్‌ను…
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లిలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు…
Financial District : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా “నగరం లోపల నగరం”గా వేగంగా రూపాంతరం చెందుతోంది. పని, ఇల్లు, విద్య, ఆరోగ్య సంరక్షణ , జీవనశైలి సజావుగా కలిసి ఉండే చక్కటి పర్యావరణ వ్యవస్థగా ఇది అభివృద్ధి చెందుతోంది. ASBL నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ దార్శనికతను పునరుద్ఘాటించారు, భారతదేశంలో అత్యంత స్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకు మారిందో డేటాతో…
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్ కు బయల్దేరనున్నారు. సోమవారం దావోస్ కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను…
SSIA: తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (SSIA)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో SSIA ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రియాన్ టాన్ (SSIA ఛైర్మన్), టాన్ యూ కాంగ్ SSIA వైస్ ఛైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), అప్లైడ్ మెటీరియల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో…